About Us

Our Story

Where Faith Finds Its Home

ప్రైస్ ది లార్డ్ నా పేరు ఎస్తేర్ క్రైసోలైట్, "మా నిమిత్తము ఎవడు పోవును"(యెషయా 6:8) అన్న వాక్యం ద్వారా దేవుడు నన్ను తన సేవ కొరకు ఒక యూత్ మీటింగ్ లో పిలిచాడు, నేను వెంటనే దీనికి అంగీకరించలేదు, కానీ దేవుడు నాతో పోరాడి నా హృదయాన్ని మార్చి, "మీనిమిత్తము శ్రమ పడటానికి నేనున్నాను ప్రభు నన్ను పంపు"అనే రీతిలో దేవునికి దేవుని పరిచర్య చేయడానికి నన్ను నేను దేవునికి ప్రతిష్టించుకునేటట్లు దేవుడు నా హృదయాన్ని తన వాక్యం ద్వారా మారుస్తూ వచ్చాడు.

నేను దేవుని కొరకు ప్రతిష్టించుకున్న నాటి నుండి నేను ప్రార్థించడం మొదలు పెట్టాను, నన్ను పంపించు దేవా మీ సేవకు మీ పరిచర్య కొరకు నన్ను వాడుకో అని, నా యౌవ్వన దశలో ఎక్కువగా దేవుని సేవకు దేవుడు నన్ను పంపించాలి అని నేను ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసేదాన్ని, కాని నాకంటే నా వెనుక వచ్చిన వాళ్ళు తొందరగా వాళ్ళకి పరిచర్య దొరికేది, చాలా సందర్భాలలో నేను దేవుని అడుగుతూ ఉండేదాన్ని నన్ను ఒక మగ వ్యక్తిగా ఎందుకు పుట్టించలేదు, వాళ్లకి లాగా నేను మీ మీ పరిచర్యను చేసే దానిని కదా, ఒక మహిళగా ఉండబట్టే నేను సేవకు వెళ్లడానికి మీ పరిచర్యను చేయడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, అని దేవుని నేను అడుగుతూ వచ్చేదాన్ని.

అలా నేను నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటూ వెళుతున్నప్పుడు, సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేయమన్న ఆ వాక్యం ద్వారా నేను హెచ్చరించబడి, నా జీవితంలోకి వస్తున్న ప్రతి అనుభవంలో దేవుని వాక్యం ద్వారా నేను సరి చేయబడి ఆదరించబడి వచ్చిన ప్రతి అనుభవాన్ని నేను వ్రాస్తూ వచ్చేదాన్ని.

అప్పటినుంచి ఇప్పటివరకు దేవుడు ఈ వ్రాసే పరిచర్యలోనే నన్ను వాడుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు నా వర్తమానాలను అనేకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉంచటానికి దేవుడు ఈ website అనే ఒక నూతన మార్గాన్ని తేరచి నా పరిచర్యను విస్తరింప చేశాడు, నా జీవితంలో నాకు కలిగిన నా సమస్యలలో నా అనుభవాలలో నేను పొందిన దేవుని వెలుగు అనేకుల జీవితాలలో వెలుగును ఆశీర్వాదము తీసుకు వచ్చేదిగా ఉండాలని నా ప్రార్థన.

Praise the Lord! My name is Esther Chrysolyte. God called me to serve Him through a youth meeting with the verse, “Whom shall I send, and who will go for us?” (Isaiah 6:8). At first, I did not immediately agree, but God worked in my heart and changed me through His Word. Gradually, I surrendered myself to serve Him, saying, “Here I am, Lord, send me to labor for Your purposes.” Since the day I dedicated myself to God, I began to pray earnestly, asking Him to use me for His service. During my youth, I often fasted and prayed for more opportunities to serve God. I sometimes wondered why I was not born as a man, because the ministry seemed easier for them. Yet, as a woman, I have faced many challenging circumstances while stepping into God’s calling. Still, I continually sought Him, trusting that He would guide me through every difficulty. Throughout my life, I have faced many experiences and trials, but God has used His Word to guide me, correct me, and prepare me. I have learned to embrace each experience as part of His plan, making the most of every moment without wasting time. From then until now, God has been using me in this ministry through writing. He has now opened a new avenue—this website—to extend my ministry and share my testimonies with many. My prayer is that the light of God I have received through my personal experiences and challenges may become a blessing and bring His light into the lives of others.

"For where two or three gather in my name, there am I with them."

— Matthew 18:20

Get In Touch
Our church

What We Believe

Faith

We believe in the power of faith to transform lives and draw us closer to God.

Love

We strive to love unconditionally, reflecting God's love in all our interactions.

🤝

Service

We are committed to serving others with humility and compassion.

🌟

Integrity

We uphold honesty and ethical conduct in everything we do.

🏠

Community

We value the belonging and support that comes from being part of a faith family.

🌱

Growth

We are committed to lifelong spiritual growth and discipleship.

Meet Our Team

Dedicated servants leading with faith and love.

S

Sister Esther Chrysolyte

Preacher & Prayer Warrior

More ABOUT US

Special Focus

ఈ దినాలలో అనేకమంది మానవులు తమ కల్పనలపై, నశించిపోయే భూసంబంధమైన విషయాలపై ఆధారపడి తమ జీవితాలను నిర్మించుకుంటున్నారు. కానీ అవి కూలిపోయే సమయం వచ్చినప్పుడు, వారు గాలికి ఎగిరే పొట్టువలె స్థిరత్వం లేకుండా, విజయము లేకుండా జీవిస్తున్నారు.

View All Posts
ప్రత్యేక లక్ష్యం  (Special Focus)
About Us5 min read

ప్రత్యేక లక్ష్యం (Special Focus)

ప్రత్యేక లక్ష్యం (Special Focus) ఈ దినాలలో అనేకమంది మానవులు తమ కల్పనలపై, నశించిపోయే భూసంబంధమైన విషయాలపై ఆధారపడి తమ జీవితాలను నిర్మించుకుంటున్నారు. కానీ అవి కూలిపోయే సమయం వచ్చినప్పుడు, వారు గాలికి ఎగిరే పొట్టువలె స్థిరత్వం లేకుండా, విజయము లేకుండా జీవిస్తున్నారు. అలాంటి శరీరానుసారమైన జీవితం నుండి బయటపడి, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించాలనే భారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచాడు. ఆ భారానికి అనుగుణంగా, దేవుని వాక్యములోనున్న సత్యాన్ని స్పష్టంగా ఇతరులకు తెలియజేసి, ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకొని, స్థిరమైన మరియు విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని పొందేలా దేవుని వాక్యాన్ని ప్రకటించడం నా ప్రత్యేక లక్ష్యం; ఇదే నా హృదయభారము. “వాక్యం మీద నిర్మించిన జీవితం ఎప్పటికీ కూలిపోదు.” మత్తయి 7:24 - 27 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. (బండమీద తన ఇల్లు కట్టిన జ్ఞానవంతుడు వానలు, ప్రవాహాలు, గాలులు వచ్చినా అది కూలలేదు; కానీ ఇసుకమీద కట్టిన ఇల్లు కూలిపోయింది.) Special Focus In these days, many people are building their lives on their own imaginations and on temporary, worldly things that will eventually fade away. But when the time comes for those things to collapse, they are left unstable—like chaff blown away by the wind—without true success or lasting foundation. To lead people out of such flesh-centered living and into a life grounded in the Word of God is a burden that the Holy Spirit has placed in my heart. According to this burden, my focus is to clearly proclaim the truth found in God’s Word, so that every person may align their life with the will of God and experience a stable, fruitful, and spiritually victorious life. This calling—to declare the Word of God and guide others into His will—is not only my focus but also the burden placed upon my heart.

Sis. Esther Chrysolyte·April 10th, 2026
More ABOUT US

MY VISION

నా జీవితంలో, నా ఆత్మీయ ప్రయాణంలో నేను అనుభవించిన దేవుని వాక్యపు వెలుగు, ఆ వాక్యములోని సత్యం, మరియు నా ఆత్మీయ అనుభవ సాక్ష్యాలను ఇతరులతో పంచుకోవడం ఇదే నా పిలుపు అని నేను విశ్వసిస్తున్నాను...

View All Posts
నా విజన్ (My Vision)
Vision5 min read

నా విజన్ (My Vision)

నా విజన్ (My Vision) నా జీవితంలో, నా ఆత్మీయ ప్రయాణంలో నేను అనుభవించిన దేవుని వాక్యపు వెలుగు, ఆ వాక్యములోని సత్యం, మరియు నా ఆత్మీయ అనుభవ సాక్ష్యాలను ఇతరులతో పంచుకోవడం ఇదే నా పిలుపు అని నేను విశ్వసిస్తున్నాను. చీకటిలో ఉన్న హృదయాలకు వాక్యపు వెలుగును చూపించడం, నిరాశలో ఉన్నవారికి దేవుని వాక్యముతో ధైర్యమును నింపడం, ప్రార్థన చేయలేని వారిని దేవుని సన్నిధికి తీసుకువెళ్లే మార్గాన్ని చూపించడం ఇదే నా సేవ యొక్క ఉద్దేశ్యం. నేను వ్రాసే ప్రతి వాక్యం ద్వారా, ప్రతి వర్తమానం ద్వారా, ప్రతి ప్రార్థన ద్వారా — దేవుని ప్రేమను స్పష్టంగా తెలియజేసి, ప్రజలను ఆయన దగ్గరకు మరింత దగ్గర చేయడం నా లక్ష్యం. నేను ఎవరికీ మేలు చేయలేను; కాని దేవుడు నా ద్వారా తన వాక్యాన్ని అందించినప్పుడు, ఆ వాక్యమే విన్న వారి హృదయాలను మార్చగల శక్తి కలిగియున్నది అని నేను విశ్వసిస్తున్నాను. దేవుని ద్వారా నేను పొందిన వెలుగు, మరొకరి జీవితాన్ని వెలిగించాలి ఇదే నా విజన్. ✨ My Vision In my life and throughout my spiritual journey, I believe that my calling is to share with others the light of God’s Word that I have experienced, the truth found within it, and the testimonies of my spiritual experiences. To bring the light of God’s Word to hearts that are in darkness, to fill those who are in despair with courage through His Word, and to guide those who do not know how to pray into the presence of God— this is the purpose of my ministry. Through every line I write, every message I share, and every prayer I offer, my goal is to clearly reveal the love of God and draw people closer to Him. I cannot bring goodness or change to anyone by myself; but when God speaks through me, I believe that His Word alone has the power to transform the hearts of those who hear it. The light that I have received from God must shine into the lives of others— this is my vision.

Sis. Esther Chrysolyte·April 10th, 2026